ఎంతో కఠినమైన డైట్ పాటిస్తే క్రమం తప్పని వర్కవుట్స్ తోనే ఫిట్ గా ఉంటారు సినిమా స్టార్స్. ఆలియాభట్ చెప్తున్న ఫిట్ నెస్ సీక్రేట్ తో ఆమె చర్మం మెరుపుకు, యాక్టివ్ గా ఉండేందుకు కేవలం పరిమితమైన భోజనమే కారణం అంటోంది. కార్టియో ,వెయిట్ ట్రైనింగ్ డాన్స్ యోగా ఇవన్ని కలసి చేయటం ఆలియాభట్ ఫిట్ నెస్ ఫార్మూలా. వీటితో పాటు డైట్ నియంత్రణ క్రమ శిక్షణతో కూడిన జీవనశైలి కూడా ఎంతో అవసరం అంటుంది ఆలియా. నూనె లేని ఆహారం ముఖ్యం కార్భోహైడ్రేట్స్ తక్కువగా పోషకాలు ఎక్కువగానూ తీసుకొంటుంది. చక్కెర జంక్ ఫుడ్స్ కు పూర్తిగా దూరం. రోజుకు 8సార్లు మితంగా తీసుకోంటుంది ఆలియాభట్..