పోలీస్ శాఖలో మహిళలు అధికారులుగా వచ్చాక  షీ టీమ్స్ ఏర్పాటు, సఖి కేంద్రాల ఏర్పాటు తర్వాత మహిళలకు కొండంత అండ దొరికినట్లే అంటున్నారు కామారెడ్డి జిల్లా ఎస్పి ఐపీఎస్‌ ఆఫీసర్ఎన్‌.శ్వేత .గతంలో పోలీసు శాఖలో చాలా తక్కువ మంది మహిళలు ఉండేవారు. పోలీస్ శాఖలో మహిళల సంఖ్య పది శాతానికి చేరింది. అసెంబ్లీ శాఖ మహిళలకు 30 శాతం కేటాయించిన తర్వాత సంఖ్య పెరిగింది. ఏడు వేలకు పైగా మహిళా ఉద్యోగులు అధికారులు సిబ్బంది పనిచేస్తున్నారు. మహిళా కానిస్టేబుళ్లు ఎస్ ఐ లు అందరికీ డ్రైవింగ్ లో  శిక్షణ ఉంటుంది. బందోబస్ట్ పెట్రోలింగ్ ట్రాఫిక్ డ్యూటీ లన్నీ చేస్తున్నారు. అన్ని రకాలుగా మహిళలు మగవాళ్లతో సమానంగా సత్తా చూపిస్తున్నారు అంటున్నారు శ్వేత.

Leave a comment