ఆఫీస్ కో ,చిన్న పార్టీకో సింపుల్ మేకప్ తో వెళ్ళవచ్చు. అది ఇంట్లోనే చేసుకోవచ్చు అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. ముఖం శుభ్రంగా కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆపైన ప్రైమర్ అద్దుకోంటే ముడతలు గీతలు కనిపించకుండా పోతాయి.కళ్ళకి ఐలైనర్ ,కాజల్ వాడితే సరిపోతుంది. నాణ్యమైన కాజల్ తో వాటర్ లైన్ ,లిడ్లైన్ కూడా దిద్దుకొవాలి. ఇప్పుడు కళ్ళు విశాలంగా కనిపిస్తాయి. మస్కరా కూడా పెట్టుకొంటే కళ్ళ అందం రెట్టింపు చేస్తుంది. ఇక పెదవుల కోసం ఎరుపు ప్లిమ్ హాట్ పింక్ రంగుల్లో చక్కని లిప్ గ్లాస్ వేసుకొంటే చాలు అలంకరణ పూర్తి అయినట్లే. సాయంత్రం వరకు మొహం ఫ్రెస్ గా అనిపిస్తుంది.

Leave a comment