Categories
నైట్ షిఫ్ట్ ల్లో పని చేయటం అవసరం ఈ రోజుల్లో .కానీ రాత్రి పని వేళల కారణంగా నిద్రలేమి ,తర్వాత జీవక్రియల్లో మార్పులు ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తాయని. గర్భవతులు రాత్రి పని చేయటం వల్ల అది గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తుందని ఒక అధ్యయనం చెపుతుంది. కొన్ని వందల మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో నైట్ షిఫ్ట్ ల కారణంగా శిశువు నెలలు నిండకుండా జన్మించటం మామూలు కన్న తక్కువ బరువుతో ఉండటం జరుగుతాయని అభిప్రాయపడ్డారు. రాత్రి సమయంలో పని చేస్తూ ,గర్భవతిగా ఉన్న యువతి సరైన ఆహారం తీపుకోకపోవటం నిద్రపోయే సమయం తగ్గటం వంటివి శిశువు అనారోగ్యానికి కారణం అవుతాయని కొన్ని సందర్భల్లో అబార్షన్ లు కూడా అవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.