పిల్లలు టీనేజ్ లో అడుగుపెట్టారు వారిని అనుక్షణం ఆ పని వద్దు ఇది ఇలా ఉండాలి ఇది మంచిది ఇది కాదు అంటూ అనుక్షణం ఆంక్షలు పెడితే వారు మొండిగా అయిపోతారు అంటున్నారు సైకాలజిస్టులు. వారి పై అజమాయిషీ లేని నియంత్రణ ఉండాలంటారు. ఏదైన తప్పు చేస్తే అది ఎలా తప్పో ఎందుకుచేయకూడదో వారికి వివరంగా అర్ధమయ్యేలా చెప్పాలి. వారితో స్నేహపూర్వక వైఖరితో ఉండాలి. వాళ్ళతో సరదగా ఉంటూ కాస్త కఠినత్వం అవలంభించాలి. కాస్త వయసు పెరుగుతు ఉంటే స్నేహితులు చాటింగ్ మాములే. వద్దంటూ కట్టుదిట్టం చేయబోతే అబద్దాలు అలవర్చుకుంటారు. ఇంట్లో వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ప్రత్యేక ప్రపంచం సృష్టించుకునే ప్రమాదం ఉంది. కనుక పిల్లలతో వారి స్నేహితుల్లా పెద్దవాళ్ళు మెలిగితేనే వాళ్ళని కాస్త కట్టడి చేసే అవకాశం ఉంది.

Leave a comment