ఇవ్వాళ మహిళలు ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ, అంతులేని సాహసాలు చేస్తున్నారు. ఎన్నో సౌకర్యాల నడుమ, ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుని అడుగులు వేస్తున్న ఇందుకు రహదార్లు వేసిన వాళ్ళనే మొదటగా తలుచుకోవాలి. స్వాతంత్రానికి ముందు రోజుల్లో ఫోటో గ్రాఫి సామాన్యులకు అనుడుబాతులో లేదు. ఫొటోగ్రాఫర్లు అందరు పురుషులే. అలాంటి రోజుల్లో ఫొటోగ్రాఫీ పై మక్కువతో ఫోటో జర్నలిజం లోకి అడుగుపెట్టారు. హోమాయి వ్యారావాలా. మన దేశంలో తోలి ఫోటో జర్నలిస్ట్ గా ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా యుర్ధరంగానికి వెళ్లి ఫోటోలు తీసిన సాహసం అమెది రెండో ప్రపంచ యుర్ధం జరుగుతున్నప్పుడు ఆమె తీసిన ఎన్నో విలువైన ఫోటోలను అప్పట్లో ది ఇలస్త్రేటెడ్ వీక్లీ అఫ్ ఇండియాలో ప్రముఖంగా ప్రచురించారు.
Categories