Categories
పచ్చని మొక్కల్లో గులాబీలు పూసిన అందంగా ఉంటాయంటారు పచ్చ కెంపుల నగలు. పాశ్చాత్య దేశ నగిషీలతో పూలు ,ఆకులు కలసినట్లు ఈ నగలు చాలా ప్రత్యేకం, ముత్యాల గుత్తుల హారాలలో కెంపులు ,పచ్చలు కలగలసి నాలుగైదు వరుసల గొలుసులు ,ఈ రెండు రత్నాలతో చేసిన నెక్లస్ లు ప్రత్యేక రోజు పెళ్ళిరోజు వేడుకల్లో ఎంతో చక్కగా అమరిపోతాయి . ఆకుపచ్చని రత్నాన్ని రోజు తదేక దీక్షతో కంటికి మంచిదట . పూర్వ కాలంలో ప్రేమికులు వీటిని ధరిస్తే ఒకరి మనసులోని భావాలు ఇంకోళ్ళకి అర్ధం అవుతాయని భావించేవాళ్ళట . సువర్ణ శోభతో ఈ కెంపు పచ్చల నగలు అమ్మాయిల మెడలో ఎంతో శోభతో కనిపిస్తాయి