పదిహేను కథలున్న ఈ కథ సంకలనంలో దాదాపు అన్ని స్త్రీ కేంద్రంగా నడిచినవే . కథల్లో ఎక్కడ జడ్జ్ మెంట్స్ ఉండవు . రచయిత్రి ఎదురుగ్గా కూర్చొని కథ చెపుతునట్లు ఉంటుంది . ఈ కథల్లో స్త్రీలు బాధితులు కారు . హుందాగా జీవన పోరాటం చేస్తాయి . ఇల్లు ,ఉద్యోగం రెండూ సమతూకంతో చక్క బెడతారు . మొదటి కథ కిమయలో మంజు సచ్ఛమైన అమ్మాయి. మనసులో ఏదనుకోంటే అదే మాట్లాడేస్తూ ఉంటుంది . సాధారణంగా లౌకిక ప్రపంచంలో మనసులో భావాలకు ఏడిటింగ్ ఉంటుంది . అవతల మనుషులు ఏమనుకొంటారో ,బావుండదేమోనన్నసంకోచం అంతర్లీనంగా పనిచేస్తూ మనసులో మాట ఎక్కడో అణుగిపోయి మర్నాడు రంగు పులుముకొని బయటికి వస్తూ ఉంటుంది . మంజు వట్టి బోళాతనంతో మాట్లాడేస్తూ తెచ్చి పెట్టె చిక్కుల కథ ఇది . పరిమళం కథలో రాజమ్మగారు ఇరుగు, పోరుగు కోసం ,చుట్టూ సమాజం గురించి ఆలోచించి సాయం చేసే వ్యక్తి రాజమ్మగారి వంటి పరిమళ భరితమైన రమణులు ఈ ప్రపంచంలో కొందరుంటే మిగతా అందరు సుఖంగా ఉంటారు . వీళ్ళవంటి వాళ్ళు ఎదుటివాళ్ళకు రోల్ మోడల్స్ అవుతారు కూడా . క్వీన్ కథ ఇప్పటి తరం అమ్మాయిల మనోభావాలకు అద్దం పడుతుంది . పెళ్ళి అనే వ్యవస్థ లో ఉండే అణచివేతల్ని ,ఇబ్బందులను తమ పై తరాల నుంచి చూసి అర్దం చేసుకొని అసలాదాంపత్య సంబందాలు కంటే సహా జీవనాన్ని ఇష్టపడుతున్నారు . విద్యావంతురాలైన తల్లి తన కూతురు తీసుకొన్న నిర్ణయం గురించి ఆవేదన పడుతుంది ఈ కథలో . తీరా కూతురు పెళ్ళి లేకుండా కలసి ఉండటాన్నే స్వాగతించి నపుడు తండ్రి అర్ధం చేసుకొని ఆమోదిస్తారు . ఈ తల్లితండ్రులు కొత్త తరం వాళ్ళు . పిల్లల్ని అర్ధం చేసుకొని వాళ్ళకు తోడుగా నిలిచే వాళ్ళు కథ చాలా చక్కగా నడిపించారు రచయిత్రి అనురాధ . వృత్తి రీత్యా టీచర్ కనుక పిల్లల్ని విద్యావంతులను చేయటమే లక్ష్యo కనుక ,సమాజాన్ని ముందుకు తీసుకుపోయే కథలే రాశారు . అందుకే కథలో ఎలాంటి ఘర్షణలున్న ఏదో పరిష్కారం వైపు చక్కగా నడుస్తాయి . కథల్లో తరాల అంతరాలు ,పిల్లలు తల్లి తండ్రుల మధ్య ఆలోచన రీతుల్లో తేడాలు చిత్రించారు కానీ దుర్మార్గమైన పాత్రలు ఉండవు . కథలన్నిటిలో స్త్రీలు తమకు ఎదురై సమస్యలకు సానుకూలమైన పరిష్కారం సాదించుకోటారు .
కథలు
రచన : నాదెళ్ళ అనురాధ
ప్రతులకు : నాదెళ్ళ అనురాధ
ఫ్లాట్ నెం -102,బ్లాక్- డి
వసంత నగర్ ,పోరంకి ,విజయవాడ -521137 .
ఫోన్ నెం :7386098516

Leave a comment