Categories
కుంకుమపువ్వు ఖరీదైన సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన ఔషధం కూడా నాణ్యమైన కేసర్ ఎర్రగా ఉంటుంది. సువాసన తో చిరుచేదుగా ఉంటుంది. చిన్న గాజు గిన్నెలో చల్లనీళ్ళు పోసి కొన్ని కేసర్ రేకులు వేస్తే నెమ్మదిగా నీళ్లు పసుపు రంగులోకి మారతాయి.,కానీ రేకులు కరగవు రంగు మారదు. అలాగే నీళ్లలో వేసిన రేకుల్ని వేళ్ళతో తీసి మునివేళ్లతో రుద్దితే సహజమైనవి విరగవు. కల్తీవి అయితే పొడి పొడిగా అయిపోతాయి పొడిగా లేదా ద్రవ రూపంలో వుండే శాఫ్రాన్ ని కొనక పోవటమే మంచిది. అందులో ఎక్కువ కల్తీ ఉండవచ్చు. ఖరీదు తక్కువగా రావాలంటే అమెరికన్ శాఫ్రాన్ గా పిలిచే కుంకుమపువ్వు రేకుల్ని వాడుకోవచ్చు.