అమ్మాయిలు ఎన్నో అందమైన కీ చెయిన్ లు వాడుతోంటారు. ఈ కీ చెయిన్ చాలా ప్రత్యేకం. దాన్ని బ్రేస్ లెట్ మాదిరిగా మణికట్టుకు తగిలించుకోవచ్చు. దీన్లో ఉన్న పిన్ నొక్కితే 130 డెసిబుల్ శబ్దం తో చుట్టు పక్కల వాళ్ళని అలర్ట్ చేస్తుంది. స్త్రీల భద్రత కోసం రూపొందించిన ఈ కీ చెయిన్  లో ఎల్ ఇడి బల్ప్ కూడా ఉంది. చీకట్లో ఇది వెలిగితే దాడి చేసిన వాళ్ళను గుర్తు పట్టవచ్చు అంటారు తయారీ దారులు. దాన్ని పర్స్ లకు బాక్ ప్యాక్ లకు తగిలించుకోవచ్చు ఎన్నో రకాల డిజైన్ లతో  కీ చెయిన్ లు ఉన్నాయి. హ్యాండ్ బాగ్ లో ఉంచుకోవలసిన ముఖ్యమైన గ్యాడ్జెట్ ఇది. పర్సనల్ సేఫ్టీ అలారం కీ చెయిన్ గా పిలిచే ఈ బ్రేస్ లెట్ ని అమ్మాయిలు దగ్గర వుంచుకోవటం చాలా అవసరం.

Leave a comment