ఖరీదైన బట్టలు కొంటు వుంటాం. కొంత కాలం పాటు ఆ కొత్త దనం పోకుండా వుంటే బాగుంటుంది. ఇస్త్రీల వల్ల చెక్కగా వుతకడంతోనూ సరిపోదు. వాటి గురించి శ్రద్ద  తీసుకోవాలి. ఆడపిల్లల డ్రెస్ లు జరీలు, కుట్టు పని, పూసలు, కుందన్ వర్క్ వీటితోనే హెవీగా కనిపిస్తాయి. వాటిని మాములుగా ఉతికి అరేస్తే నాలుగైదు వుతుకులకే వేసుకునేందుకు బాగోవు. అతి జ్యగ్రత్తగా ఏ ఫంక్షన్లోనో వేసుకోవడం వెంటనే బధ్రపరచడం చేయాలి. దుస్తులకి కొత్త అందం కోసం కొన్ని పువ్వులు స్టిక్కర్స్ లేదా రాళ్ళ తో చేసిన గుండిలు వంటివి కుట్టేస్తారు. ఆ కుట్టిన దరంపైన నాచురల్ కలర్ గోళ్ళ రంగులు వేస్తె వూదిపోకుండా  వుంటాయి. వేసుకున్న దుస్తులను చెక్కగా హ్యంగర్ కు తగిలిస్తే గాలి తగిలి ఫ్రెష్ గా అయిపోతాయి. రంగుల దుస్తుల్ని నీడ పట్టున అరేయాలి. అలా అయితే సహజమైన రంగు కళ పోకుండా వుంటాయి. మాటి మాటికి వుతికేయకుండా జ్యగ్రత్త తీసుకుంటే సారి.

Leave a comment