Categories
‘డి’ విటమిన్ మన శరీరంలోనే తయారవుతుంది. మనిషి ఆరోగ్యానికి ఉపయోగాపడే కీలకమైన విటమిన్ లో విటమిన్ ‘డి’ ఒకటి. దీన్నీ ఆహారం ద్వారా టాబ్లెట్ల ద్వారా పొందాలి. నల్లని శరీరచ్చామతో ఉండే వారిలో మెలనిన్ ఎక్కువగా ఉండి ఆల్ర్టావయోలెట్ కిరణాలు చర్మంలో ఎక్కువ ప్రవేశిస్తేనే అవసరమైనంత డి విటమిన్ తయారవుతుంది. అదే తెల్లగా, ఎర్రగా ఉండే వాళ్ళలో తక్కువ కిరణాలతో విటమిన్ డి తయారవుతుంది. అలాగే ఎక్కువ సన్ స్క్రి న్ వాడినా శరీరంలోని ఆల్ట్రా వైలెట్ కిరణాలు వెళ్ళవు. విటమిన్ డి ఉంటేనే కీలకమైన అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి కనుక ఈ విటమిన్ ని శరీరం గ్రహించేలా ఆహారం తీసుకోవడమో లేదా ఉదయం ఎండలో కాసేపు ఉండటమో చేస్తూ ఉండాలి.