కిచెన్ శుభ్రత కోసం ఎన్నో క్లీనింగ్ వస్తువులు వాడుతాము కానీ సహజమైన వాటితో మరింత శుభ్రంగా ఉంచుకోవచ్చు స్టౌ పై పడిన నూనె జిడ్డు మరకలు వాసన పోవాలంటే నిమ్మచెక్కతో రుద్దాలి బేకింగ్ సోడా వేసి శుభ్రం చేస్తే వాసన పోతుంది. వైట్ వెనిగర్ తో కూడా శుభ్రం చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్, వాష్ బేసిన్ దగ్గర అద్దం పై మరకలు పోవాలంటే ముందుగా నీళ్లతో తుడిచి, తర్వాత న్యూస్ పేపర్ తో తుడిస్తే అద్దం చాలా శుభ్రంగా ఉంటుంది. ఇంకా మరకలు కనిపిస్తే టాల్కమ్ పౌడర్ వేసి తుడిస్తే చాలు. కిటికీలకు ఉండే మస్కిటో  జాలీలు నెలకోసారి సబ్బు నీళ్లతో శుభ్రం చేస్తే చాలు.

Leave a comment