Categories

పరీక్షలకు చదువుకుంటున్నా లేదా రెగ్యులర్ చదువులో ఉన్న పెద్దలు, పిల్లలను కాన్ సన్ ట్రేషన్ చెయ్యమని ఊరికే అటు ఇటు తిరగవద్దని ఇంట్లో పెట్స్ తో కుడా ఆడుకున్న కోప్పడతారు. ఇంటికి వచ్చిన బంధువులతో కాసేపు గడిపినా టైం వేస్ట్ చేస్తున్నావ్ అంటారు. కాని గంటలతరబడి స్కూల్లలో, ప్రైవేట్లలో గడిపె పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గాలని వాళ్ళకు కొంత విరామం ఇవ్వాలంటారు. ఇంట్లో బంధువులతో మాట్లాడటం పెట్స్ తో ఆడుకోవటం, బయట ఫ్రెండ్స్ తో ఆడుకోవటం ఇవన్ని ఒత్తిడి తగ్గించి వాళ్ళకు కొత్త శక్తి వచ్చేస్తుంది. కాస్త సమయం వాళ్ళను స్వేచ్చగా వదిలేస్తే మరింత సమయం బాగా చదువుకొంటారు.