నీహారికా,

చాలా మంది సిస్టామాటిక్ గా వుంటారు. రొటీన్ లో చిన్నపాటి మార్పు కూడా నచ్చదు వాళ్ళకి. లైఫ్ ఒకే రకంగా పద్దతిగా క్రమశిక్షణగా ఉండాలి . కానీ చాలా పొరపాటు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మార్పును సాదరంగా ఆహ్వానించాలి, జీవిత పరిణామాలను అనుకూలంగా స్పందించాలి, అనుగుణంగా మరి తీరాలి. లైఫ్ మారుతూ వుంది, కాస్త ఇబ్బంది అనిపించినా ఇది అనివార్యం ఎపుడూ ముందుకు సాగే జీవితం లో మార్పులు స్సర్వ సాధారణం. జీవితం లో ప్లెక్సిబిలిటీ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్య పడుతుంది . ఇక నేను మారను నా పద్దతి ఇంతే, ఇలాగే ఉంటుంది అని ఒక ఫిక్స్డ్ అభిప్ర్రాయం తో ఉంటే దాని వల్ల నష్ట పోయేది మనమే . ప్రతి దినం కొత్తదే. ప్రతి ఉదయం ఆహ్వానించ దగ్గదే. గింజ లో నుంచి మొలక, చిన్న చిగురు, ఆకు, కొమ్మ, వృక్షం ఇలా రూపాంతరం చెందినట్లే మానమూ మారాలి. ఆ మార్పు మనం మనసారా ఆనందించాలి.

Leave a comment