Categories
అరటి పండ్లే కాక పచ్చి అరటి కాయ వాళ్ళ కుడా చాలా ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి అరటి మంచి ఆహారం. ఇవి మెటబాలిజం బూస్టర్ గా పని చేస్తాయి. కొవ్వును కరిగించగల శరీర సమాధ్యాన్ని పెంచుతాయి. పచ్చి అరటిలో వుండే స్టార్చ్ కోలెస్ట్రోల్ స్ధాయిల్ని తగ్గించడంలో సహకరించి బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. సాధారణంగా కార్బోహైడ్రేడ్ శరీరంలో ముందుగా ఖర్చు అయిపోతాయి. కానీ పచ్చి అరటి కాయల్లోని స్టార్చ్ శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగిస్తాయి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో దేనిలోనైనా తీసుకోవచ్చు. ఇక అరటి పండు అయితే పోషకాలు మాయం. ఎన్నో రుగ్మతల్ని ఎదుర్కునే శక్తి నివ్వగాలవి. అరటిలోని ఫైబర్, పోటాషియం, విటమిన్ సి,బి6, గుండె ఆరోగ్యైకి సపోర్ట్ చేస్తాయి.