క్రిస్టల్ సాల్ట్ కు కాకుండా నేచురల్ గా తయారయ్యే రాతి ఉప్పు కు మాత్రమే ఎన్నో ఆరోగ్యసమస్యలను తగ్గించే గుణం వుంటుదన్నారు ఎక్స్ పర్ట్స్. ఇది స్వచ్చమైనది. ఆయుర్వేద మందుల తయారీలో ఈ ఉప్పే ఉపయోగిస్తారు. ఈ ఉప్పుతో మధుమేహం, ఆస్ట్రియో పార్సిస్, డిప్రెషన్, స్ట్రెస్, కండరాల నొప్పులు, తల దిమ్ముగా వుండటం లాంటి ఎన్నో సమస్యలు పరిష్కరించ వచ్చు. ఈ ఉప్పుతో అధ్యాత్మిక శక్తి కూడా ఉందంటున్నారు. నమ్మకం వున్న వాళ్ళు ఒక చిన్ని గిన్నె లో ఉప్పు కర్పూరం కలిపి ఉంచితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జిలు పోతాయి అంటున్నారు. ఈ నమ్మకాలు అవతల పెడితే స్నానం చేసేటప్పుడు స్క్రుబ్ కోసం ఉప్పును ఉపయోగిస్తే మలినాలు తొలగిపోతాయట. ఉదయం గోరు వెచ్చని నీళ్ళల్లో పావు టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి తాగితే అంతర్గత వ్యవస్థ శుభ్ర పడుతుందిట. ఇల్లు ఫ్లోర్ లు తుడిచేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉప్పు వేసి తుడిస్తే ఈగలు రాకుండా వుంటాయి. అలాగే ఉల్లిపాయ వంటివి కోసిన వాసన పోవాలంటే చేతులు ఉప్పు నీటి తో కడుక్కోవాలి.
Categories