అలంకరణ పుష్పాలైన గెర్బెరా పూలు పంటను సాగు చేసి జార్ఖండ్ రాష్ట్రానికి ఘనత తెచ్చారు. జంషెడ్పూర్ సిస్టర్స్ గా ప్రఖ్యాతి చెందిన అక్కచెల్లెళ్ళు ప్రియాంక భగత్, ప్రీతి భగత్ ఫ్యాక్టరీ వర్కర్ గా పని చేసే తండ్రి నవ కిషోర్ భగత్ ఉద్యోగం కోవిడ్ కారణంగా పోవటంతో అక్కచెల్లెళ్ళు తండ్రితో కలిసి తల్లి నగలు కుదువపెట్టి వాళ్లకు ఉన్న భూమిలో గెర్బెరా పూలసాగు మొదలుపెట్టారు. కోసిన తర్వాత కూడా 15 రోజుల పాటు తాజాగా ఉండే ఈ పూలు ఎంతో ఆదాయం తెచ్చిపెట్టాయి. ఇప్పుడు చుట్టుపక్కల రైతులంతా ఈ పూల పెంపకం వ్యాపారం లోకి దిగారు.ఈ అక్కాచెల్లెళ్ల కృషితో జార్ఖండ్ లో ఈ వాడని పూలు వికసిస్తున్నాయి.

Leave a comment