Categories
వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతోంది. ఇక ఎసి లు పని చేయటం మొదలైంది ఎసిలో పని చేసే స్త్రీ పురుషుల్లో స్త్రీ లకు చల్లని వాతావరణం ఇబ్బంది కలిగిస్తోందని ఓ అధ్యయనం చెపుతోంది. 500 మంది స్త్రీ పురుషులను 24 టీమ్ లుగా విభజించి వివిధ గదుల్లో వుంచారు. అందులో 61 దగ్గర నుంచి 91 ఫారెన్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత మారుస్తూ వచ్చారు. ఉష్ణోగ్రత పేరిగినపుడే స్త్రీలు చురుగ్గ పని చేయగలగారట. వాతావరణం చల్లగా వుంటే పురుషుల పనితీరు మెరుగైందట మహిళలు 77 ఫారెన్ డిగ్రీల వాతావరణం లో సౌకర్యంగా ఉంటే పురుషులో 72 ఫారెన్ డిగ్రీల ఉష్ణోగ్రత లో కంఫర్ట్ గా ఫీలయ్యారు ఈ మార్పు శరీర నిర్మాణం కారణమో,స్త్రీలు ధరించే దుస్తుల వల్లనా అని అధ్యయన కారులు ఆలోచనలో పడ్డారు.