ఎంటర్ ది డ్రాగన్ సినిమా తో బ్రూస్లీ ప్రేక్షకులకు ఒక తుఫాన్ లాగా పరిచయం అయ్యాడు కుంగ్ ఫూ,మార్షల్ ఆర్ట్స్ తో బ్రూస్లీ చేసిన సాహసాలతో ఒక అర వీర బయంకరుడైన కరాటే వీరుడిని ప్రేక్షకులు ఆదరించారు. క్రమశిక్షణ,కఠిన శ్రమతో శరీరాన్ని ఉక్కులా మార్చుకున్న బ్రూస్లీ గురించి అయన కూతురు షానన్ లీ బీ వాటర్ మై ఫ్రెండ్ పేరు తో ఒక పుస్తకం రాసింది. బ్రూస్లీ గురించి ప్రపంచానికి తెలియని అనేక కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చింది. ప్రపంచం లో నీటి కంటే మృదువైనదీ,శక్తివంతమైందీ ఇంకేదిలేదు.. ఈ నీళ్ళు నాకు కుంగ్ ఫూ సూత్రాలను బోధించాయి అనేవాడట బ్రూస్లీ. ప్రవహించే నీరు లాగే జీవితంలో ఎప్పటికీ కదలిక ఉండాలనుకునేవాడట. అందుకే ఈ పుస్తకానికి బీ వాటర్ మై ఫ్రెండ్ అన్న పేరు పెట్టింది షనన్ లీ. ఐదడుగుల ఏడంగుళాలు ఉండే బ్రూస్లీ శరీరాన్ని ఎప్పుడు దృడంగా బక్కపలచగా ఉండేలా చూసుకునేవాడు కుంగ్ ఫూ సాధన తో తన కుడి చేతితో 500 పంచ్ లు ఎడమచేతితో 250 పంచ్ లు ఇచ్చేవాడట ఎప్పుడూ యాక్టివ్ గా నిత్యం శరీరాన్ని కదిలిస్తూనే ఉండేవాడు.లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కేవాడు బాక్సింగ్, ఫెన్సింగ్ బయో మెకానిక్స్ తత్వశాస్త్రంలో కొన్ని అంశాల తో తన నైపుణ్యాలకు మెరుగు పెట్టుకునేవాడు. మెదడును ప్రశాంతంగా ఉంచి శక్తి పొందటం పైన బ్రూస్లీ కి ఎంతో నమ్మకం అందుకే ఉదయపు నడకలో కూడా నడుస్తూ ధ్యానం చేసేవాడు. 13 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయసులో బ్రూస్లీ మరణించే వరకు ఒక్క రోజు కూడా సాధన మానలేదు మా నాన్న ఫిలాసఫీ ‘నీళ్ళలా గా ఉండు ఫ్రెండ్’ అనటమే అంటుంది కూతురు షనన్ లీ.

Leave a comment