అరోమా నూనెలతో వత్తిడి కి చెక్ పెట్టచ్చని చెప్పుతున్నారు స్పెషలిస్టులు. లావెండర్ నూనె లో ఆరోమాటిక్ మాలిక్యుల్స్ ఎక్కువ శాతం వుంటుంది. ఈ నూనెల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గునాలెన్నో వున్నాయి. నీళ్ళలో లావెండర్ నూనె, ఎప్సమ్ సాల్ట్, పాలు కలిపి స్నానం చేస్తే ఒత్తిడి మాయం అయిపోతుందంటున్నారు. అలాగే మంచి నిద్ర పడుతుంది. ఇక లావెండర్ నూనె తో మర్దనా చేస్తే కండరాళ్ళ నొప్పులు పోతాయి. అలాగే యూకలిప్టస్ నూనె లో కొబ్బరి నూనె కలిపి మాడుకు మర్దనా చేస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరిగి, తల కండరాల నొప్పులు సర్దుకుని ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ నూనె తో శరీరం లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

Leave a comment