దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన దేశాన్ని ఎంతో ప్రేమించారు. భారత భాగ్య విధాత అనే శీర్షిక 1911 లో రాసిన ఈ గీతం దేశ భవిష్యత్తును ఒక రధసారధి లా ఎలా ముందుకు నడిపించాలో చెపుతుంది. జనగణమన ఇక నుంచి మన కొత్త గణ తంత్ర రాజ్యానికి జాతీయగీతమని దాన్ని అందరూ గౌరవించాలని 1950 జనవరి 29 న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేసారు. ఆ ప్రకటనే ఒక శాసనంగా ఇప్పటివరకు అమలు జరుగుతూ వుంది. జాతీయ గీతం జాతీయ పతాకం వల్ల గౌరవం ప్రేమాభిమానాలు ప్రదర్శించటం అంటే మాతృ భూమిని గౌరవించుకోవటమే. దీన్ని గౌరవించి ఆదరించటం ప్రజల్లో సహజ సిద్ధంగా రావాలని సుప్రీమ్ కోర్టు తన ఉత్పాదుల్లో వ్యాఖ్యానించింది. ఇప్పుడు సినిమా హాళ్లలో వేస్తున్నారు. తప్పనిసరిగా లేచినిలబడి గౌరవించండి.
Categories