Varanadanam నృత్యానికి చిత్రకళని కలిపే నృత్యం ఇది. కేరళలోని కాసర్‌గోడ్‌ దగ్గర లోని పయ్యూర్‌ కు చెందిన 30 ఏళ్ల లీజా దినూప్‌ భరత నాట్యం చేస్తూనే వేదికపైన కాన్వాస్ పైన దేవతల బొమ్మలు గీయగలదు ఈ ఆర్ట్ నే వారనాదానమ్ అంటారు నృత్యం చేస్తూ మధ్యలో కాన్వాస్ దగ్గర ఉన్న కుంచె తో నృత్యం లో ఉన్న ఆధ్యాత్మిక భక్తి భావాలకు తగిన బొమ్మ వేయగలదు. ముఖ్యంగా రామాయణం లోని నవరస చిత్రాలను గణేశ్ భక్తిని స్త్రీ శక్తి రూపాన్ని ఇటు కాన్వాస్ పైన రంగుల్లో అటు నృత్యం ద్వారా దేహం తో ప్రదర్శించగలదు. ఇలా చేయగలిగే ఏకైక చిత్రకారునిగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోనూ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోను చోటుచేసుకున్నది లీజా దినూప్‌.

Leave a comment