కాలుష్యం తోనూ మారే వాతావరణంతో కూడ జుట్టు ఎండినట్లు ,జీవం కోల్పోయి పీచులా అనిపిస్తూ ఉంటుంది . కొన్ని మాస్క్ లు జుట్టుకు ప్రాణం పోస్తాయి . శెనగపిండి ,పెరుగు నిమ్మరసం సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి . అరగంట ఆరనిచ్చి తల కడిగేసుకోవాలి . షాంపూ వాడకూడదు . వారంలో రెండుసార్లు ఈ పూతవేసుకొంటే జుట్టు బావుంటుంది శెనగపిండి ,గుడ్డు ,కొంచెం పెరుగు కాస్త కొబ్బరినూనె కలిసి ముందుకు పట్టించి ఓ గంట ఆగక గాఢత తక్కువగా ఉంటే షాంపూతో కడిగేస్తే సరిపోతుంది . కలబంద గుజ్జు తేనె,కొబ్బరినూనె కలపిన మిశ్రమం కూడా తలకు పట్టించి స్నానం చేస్తే జుట్టు మెరిసిపోతుంది .

Leave a comment