Categories
బొట్టుబిళ్ళ పెట్టుకోవడమే ఈ రోజుల్లో బొట్టు పెట్టుకోవడం అంటే చాలామందికి ఈ బొట్టు బిళ్ళ అంటించిన చోట ఎలర్జి వస్తుంది. కాస్త దురదగా ఉండటం వల్ల సమస్య అనిపించదు.కొన్నాళ్ళకు అది శాస్వత సమస్య అయిపోయి ఆ ప్రదేశంలో మచ్చ పడిపోతుంది.అసలు ఈ బొట్టు బిళ్ళలు పీవీసి మెటీరియల్ తో తయారు చేస్తారు అది ప్లాస్టిక్ కెమికల్ తో తయారవుతుంది. ఈ రసాయనం బిళ్ళ వెనక ఉండే జిగురు వల్ల ఎలర్జీలు వస్తాయి. వెంటనే వైద్యం చేయకపోతే దురద ఎక్కువై ఇరిటెషన్ ర్యాష్ లా వచ్చి ఎగ్జిమా ఎటోపిక్ డెర్మటైటిస్ కి దారి తీస్తుంది.అందుకే ముఖం మీద మాయిశ్చరయిజర్ రాసి బొట్టు పెట్టుకోమంటున్నారు.