ఉదయం ఆఫీస్, సాయంత్రం షాపింగ్, రాత్రికి పార్టీ ఇలా అంటూలేని బిజీ షెడ్యుల్స్ మధ్యలో, ఒక్కో పనికి అనువుగా వుండే రకరకాల బాగ్స్ మారుస్తూ ఉంటారు. ప్రతి సారి ఒక్క బ్యాగ్ లో ఎన్నో అవసరమైన వస్తువులుంటాయి. ఇంకో బ్యాగ్ లోకి త్వరగా మార్చేయడం కష్టమే. ఇది ది బ్యాగ్ ఎక్స్ చేంజ్ బ్యాగ్ లో ఇలాంటి సమస్యలు వుండవు. ఇందులో ఏడెనిమిది చిన్ని చిన్ని బ్యాగులు ఉంటాయి. ఇందులో మనం ఒక దానిలో డబ్బు, కార్డులు, ఇంకో బుల్లి బ్యాగులో ఫోన్, ఇంకో దాన్నో ముఖ్యమైన పేపర్లు, ఇంకోదాన్లో మేకప్ వస్తువులు సర్దుకుని పెట్టుకోవచ్చు. ఇవి వేటికవి విడిగా తీసి అవతల పెట్టేయవచ్చు. ఇవి వేటికవి విడిగా తీసి అవతల పెట్టేయవచ్చు. ఇంకో బ్యాగ్ లోకి వస్తువులు మార్చుకోవాలంటే ఈ ఏడెనిమిది బుల్లి పర్సుల్ని ఆ బ్యాగ్ లోకి ట్రాస్స్ ఫర్ చేయొచ్చు. అలాగే బ్యాగ్లో అన్నో అరలు వస్తువులు పెట్టుకునే వీలు కావాలి. అనుకుంటే ఈ బ్యాగ్ ఎక్స్ చేంజ్ బ్యాగ్ చాలా అందంగా వుంది.

Leave a comment