Categories
ఇప్పుడు మేకప్ మెటీరయల్, హెయిర్ కలర్స్, తలకు వేసే డై తో ఎన్నెన్నో ఎలర్జిక్ రియాక్షన్స్ రావొచ్చు. ఏదైనా మేకప్ కారణంగా అయితే కళ్ళ చుట్టూ ఎర్రగా అయిపోవడం జరుగుతుంది. కొద్ది సార్లు షాంపు, ఫేస్ వాష్ ల వల్ల కుడా ఎలర్జీ రావొచ్చు. కండీషన్ ను బట్టి యాంటీ- ఎలర్జిక్ టాబ్లెట్ వేసుకోవచ్చు. డెర్మటాలజిస్ట్ సలహా మేరకు మైల్డ్ కార్టిసాన్ క్రీమ్ వాడినా పర్లేదు. నెటాఫిల్ డామ్ వంటి మాయిశ్చరైజర్ రాయచ్చు. కొద్ది కాలం వరకు అంటే ఎలర్జీ పోర్తిగా తగ్గేవరకు ఐలైనర్లు, మస్కారా, ఐషాడోలు, కోల్ వంటివి ఏవీ వాడకూడదు. సాధారణంగా మేకప్ మొదలు పెట్టే ముందర మేకప్, అండర్ ఐక్రీమ్స్ డెర్మటాలజిస్ట్ సలహా పైనే వడాలి.