న్యాయ వ్యవస్థలో మార్పులు మాత్రమే మహిళల జీవితంలో వచ్చే సమస్యల నుంచి బయటపడేలా చేసి సాయపడగలవు ,సినిమాలు ప్రసంగాల వల్ల మాత్రం కాదు అంటోంది రాశిఖన్నా. నటిగా నేను మహిళలకు సంబంధించిన ఇతి వృత్తాలున్న సినిమాలు ఆ పాత్రను అర్ధం చేసుకొని నటించగలను .సామాజిక మాధ్యమాల ద్యారా ప్రజల్లో అవగాహన కల్పించేలా మాట్లాడగలను . నేను చెప్పిన అంశాలకు కట్టుబడి ఉండగలను . కానీ ఒక గొప్ప మార్పు రావాలంటే నేను చేసే పని సరిపోదు .మహిళలపై వేదింపులు తగ్గాలంటే బలమైన న్యాయ వ్యవస్థ,త్వరగా విచారణ చేసి కఠిన శిక్షలు విధించి అమలు పరచాలని ,తెర పై మేం ఏం చూపిస్తున్నామన్న విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అంటోంది రాశిఖన్నా.