Categories
టింకా క్రిస్టఫర్ అనే శిల్పి యువకుడిగా కనిపించే గాంధీ విగ్రహాన్ని చెక్కింది. 21 ఏళ్ల పాటు ఆయన జీవించిన దక్షిణాఫ్రికా లోని జోహెనెస్ బర్గ్ లో ఈ యువ గాంధీ విగ్రహం కనిపిస్తుంది. కోటు వేసుకుని, దానిపైన లాయర్ గౌను వేసుకున్న గాంధీజీ నిలువెత్తు శిలా విగ్రహం ఉన్న ప్రాంతాన్ని గాంధీ స్క్వేర్ గా పిలుస్తారు. శిలా విగ్రహం కింద ఫలకం మీద ఎంకె గాంధీ, అటార్నీ ఎట్ లా అన్న అక్షరాలు ఉంటాయి రోజుకి పది గంటల చొప్పున మూడు నెలల్లో ఈ శిల్పాన్ని పూర్తి చేశాను అంటుంది క్రిస్టఫర్.