జీవిత భాగస్వామి తనకంటే కాస్త ఎక్కువ అందంతో ఉంటే పర్లేదు కానీ, స్నేహితులు మాత్రం తనకంటే తక్కువ అందంతో వుండాలనుకొంటారట అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఎందుకిలా అని అడిగితే కాస్త అందం తక్కువగా ఉన్నవాళ్ళ మధ్య తాము మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే కోరిక వల్లే అన్నారట. ఒక అన్ లైన్ సర్వే లో 1500 మంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా తమ చుట్టు ఉన్నవాళ్ళు అందంగా లేక పోతే తాము చూడ ముచ్చటగా ఉంటాం కదా అనే అభిప్రాయంలో చాలా మంది అందంగా వుండే వాళ్ళు అనాకారుల స్నేహం కోరుకుంటారట. అలాటి గ్రూప్ లో వుంటే తాము అందరికంటే ఆకర్షణీయంగా కానిపిస్తారనే భావన ఎంతో సంతృప్తి ఇస్తుంది అన్నారట అందుకే సినిమాల్లో హీరో చుట్టు ఉండే స్నేహితుల బ్యాచ్ ఎప్పుడు కాస్త అందం తక్కువగానే వుంటారు. హీరో ప్రత్యేకంగా ఉంటాడు.

Leave a comment