వర్షం పడుతూ ఉంటే మేకప్ తో బయటికి పోవటం కష్టం ఎలాంటి మేకప్ లేకుండా మొహం తేటగా మెరిసేలా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. ఉదయం పూట ఫేషియల్ స్క్రబ్బింగ్ క్లెన్సింగ్ తో మొటిమల మచ్చలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బాదంపప్పులు నీటిలో నాననిచ్చి మెత్తగా గుజ్జుగా చేయాలి. అందులో స్పూన్ పెరుగు ఎండబెట్టిన నిమ్మ నారింజ తొక్కల పొడి పుదీనా ఆకుల పొడి కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత చేతివేళ్ళను తడి చేసుకుని స్క్రబ్ చేయాలి. మృతకణాలు పోయి చర్మం మృదువుగా మారి పోతుంది. ఓట్ మీల్ ను గుడ్డులో తెల్లసొన, తేనె లేదా పెరుగు కలిపి ప్యాక్ వేసుకొని అరగంట తర్వాత కడిగేస్తే చాలు క్రమంగా మొహం మేకప్ వేసుకున్నంత మెరుపులు ఉంటుంది.

Leave a comment