చలికాలం ముగింపుకు వస్తూ వేసవి ఎండ చురుక్కుమంటూ తగలటం మొదలు పెట్టాక ఇక గడ్డ పెరుగును తప్పని సరిగా భోజనంలో భాగంగా చేసుకోమంటున్నారు డాక్టర్లు. మంచి విషయంలోనే కాదు ఆరోగ్యపరంగానూ పెరుగు చాలా గొప్ప మేలు చేస్తుంది. పెరుగులో ఉండే పోషకాల ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. రోజు పెరుగు తింటే వేసవిలో మేనిలో మంచి నిగారింపు వస్తుంది. చర్మంలో తేమ ఉండేలా సాయపడుతుంది. పెరుగులో పోటాషియం ,మెగ్నిషియం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ ,అమెడోఫిల్లస్ బాక్టీరియా మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. హానికరమైన బాక్టీరియాను తుద ముట్టించి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కొవ్వులేని పెరుగన్నం బరువు తగ్గలనుకొన్న వారికి ఔషద సమానం అంటారు ఒబేసిటీ నియంత్రించే డాక్టర్లు.

Leave a comment