Categories
ఎత్తు ఎక్కువగా ఉండే ఆడవాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది అంటున్నాయి డచ్ దేశ పరిశోధక ఫలితాలు. ఎత్తు ,బరువు ,ఆరోగ్యంపైన జరిగిన ఒక పరిశోధనలో 90 ఏళ్ళ వరకు జీవించే మహాళల్లో ఎత్తు బరువు పాత్ర ఉంది. 5.3 అడుగుల కన్నా తక్కువ ఎత్తు ఉన్న మహిళలు అంత దీర్ఘకాలం జీవించటం లేదన్నారు.యుక్త వయసు నుంచి శరీరం బరువు ఎత్తు ఆరోగ్య పరిస్థితిపై ఉన్న అంశాలపైన జరిగిన అధ్యయనంలో ఎత్తు తక్కువగా ఉన్నా ఆడ,మగ ఇద్దరికీ శారీరక వ్యాయామం అవసరం.దాని పైనే వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తేలింది. కొన్ని వేల మందిపై సంవత్సరాల తరబడి జరిగిన ఈ అధ్యయనంలో శరీరక ధృఢత్వంపైన ఆరోగ్యం ఆధారపడి ఉందని అధ్యయనకారులు తేల్చారు.