ప్రపంచ దేశాల్లో భారతీయులు తినే ఆహార పదార్ధాలు, వాటిలో వాడే మసాలా దినుసుల పట్ల ఎంతో క్రేజ్ వుంది. వంటల్లో వాడే మసాలా పదార్ధానికి రంగు రుచి ఇస్తాయి. వీటిలో యాలకుల విలువ అధికం, వాటివల్ల ప్రయోజనాలు అధికమే, దంత సమస్యలకే కాదు, శరీరం లావేక్కకుండా కాపాదేవి యాలకులు. యాలకులు, దాల్చిన చెక్క రెండూ శృంగార ఉద్దీపనాలు అని అరేబియన్లు భావిస్తారు. చెట్టు బెరడు నుండి తీసే దాచిన చెక్క నూనె రక్తంలో చక్కెరను హరిస్తుంది. దాల్చిన చెక్క బాక్టీరియాను కూడా హరిస్తుంది. ఇంకో శక్తివంతమైన ఔషదం అల్లం. జీలకర్ర కూడా ముఖ్యమైన దినుసు. శరీరానికి హాయిని ఇస్తుంది. ఇక ఔషద గుణాలు దాచిన కరివేపాకు గురించి చెప్పే పనిలేదు. లవంగానికి ఉన్న గుణాలు ఎప్పుడోఅర్ధం చేసుకున్నరందరూ. ఇందులో ఉండే యూజనాల్ అనే రసాయనం బాధ నివారిణి గా పని చేస్తుంది. నోటి పోక్కులకు, దంతాల బాధలకు లవంగం అద్భుతంగా పని చేస్తుంది.

Leave a comment