కరోనా కొత్త జీవిత విధానాన్ని తెచ్చిపెట్టింది. ఇదివరకు లాగా బ్యూటీ క్లినిక్ కో, జిమ్ కో,అలా వెళ్లి పోయే అవకాశం పోయింది. కాస్తయినా మేకప్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్లు ఇంట్లోనే ట్రయ్ చేయవలసి వస్తుంది. కొన్ని మెలుకువలు తెలుసుకుంటే ఈజీగా మేకప్ వేసుకోవచ్చు మేకప్ కు ముందు రెండుసార్లు క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి .మొదటిసారి జిడ్డు వదిలిపోయి, రెండోసారి చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. టోనర్ అయ్యాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఇక మేకప్ ప్రైమర్ తో మొదలు పెట్టాలి .ఇది వేరు రంగుల్లో ఉండే ఐశాడో బ్లష్ వంటి వాటి ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. మేకప్ ఎక్కువ సేపు నిలవాలన్నా అందంగా కనిపించాలన్న ప్రైమర్ పాత్ర కీలకం. మ్యాటీ తరహా ప్రైమర్ కొద్దిగా రాసుకుంటే ముఖం పై రంద్రాలు కనిపించకుండా ఉంటాయి. ప్రైమర్ రాసుకోకపోతే ఫౌండేషన్ జిడ్డుగా అయిపోతుంది. ఫౌండేషన్ తర్వాత చివరగా మేకప్ సెట్టింగ్ పౌడర్ తో ముగించాలి. ఇది ఎక్కువసేపు మేకప్ చెదిరిపోకుండా కాపాడుతుంది. బుగ్గల పై బ్లష్ కళ్ళకు మేకప్ వేసుకోవాలి .కళ్ళకు ముందు ఐ షాడో తర్వాత ఐ లైనర్ చివరగా మస్కారా రాసుకోవాలి. పెదవులకు లిప్ లైనర్, లిప్ స్టిక్ తో మేకప్ పూర్తి అయిపోతుంది. ఒకటి రెండు సార్లు ఇంటిదగ్గర ట్రై చేస్తే నెమ్మదిగా ఇంట్లోనే చక్కగా మేకప్ వేసుకోవటం అలవాటైపోతుంది.
Categories