ఈ సీజన్ లో చల్లని వాతావరణంలో మొహం పొడిబారి పోయి తెల్లని పగుళ్ళు కనిపిస్తాయి . అలాటప్పుడు పౌడర్ రూపంలో ఉండే మ్యాటీ పైయింగ్ ఫౌండేషన్స్ వాడొద్దు . ఇవి చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి . ఆయిల్ బెస్ట్ ఫౌండేషన్ రాసుకొంటే చర్మం తాజాగా కాంతివంతం గా ఉంటుంది . దానిపైన బీ బీ క్రీమ్ లేదా సీ సీ క్రీమ్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి . ఈ సీజన్లో లిప్ బామ్స్ తప్పకుండా వాడాలి . చాప్ స్టిక్ రకం లిప్ బామ్స్ రాసుకొంటే పెదవులకు తేమ అందుతుంది . అలాగే స్ప్రే రూపంలో ఉండే ఫేస్ మిస్ వాడితే స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది . మేకప్ వేసుకొనే సమయంలో బ్రష్ స్పాంజెస్ వాడితే మేకప్ చక్కగా వస్తుంది . ఈ చల్లని గాలులు వీచే సమయంలో మేకప్ లో కొన్ని ఇలాటి మార్పులు చేసుకొంటే చర్మం చక్కగా ఉంటుంది .

Leave a comment