ఈ చలి రోజుల్లో చర్మం పొడిబారిపోతుంది. చర్మానికి పోషణ ఇచ్చేందుకు కొన్ని ఉత్పాదనలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . రెండు టీ స్పూన్ల మైనం ,టీ స్పూన్ కోకో పౌడర్ ,రెండు స్పూన్ల బాదం నూనె ఐదారు చుక్కలు ఎస్సెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి . మైనం కరిగించి దానిలో మిగతా పదార్దాలు వేసి బాగా కలిపి చిన్న బాటిల్ లో భద్రం చేసుకోవాలి. ఈ లిప్ బామ్ పగిలిన పెదవుల సమస్య నివారిస్తుంది. అలాగే మంచి బాడీ స్క్రబ్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు రెండు స్పూన్ల్ టీ పౌడర్ ,కప్పు బ్రౌన్ షుగర్ పావు కప్పు కొబ్బరి నూనె,కాసిని నీళ్ళు తీసుకోవాలి నీళ్ళలో టీ పొడి మరిగించి దాన్ని వడకట్టి ఆనీళ్ళలో బ్రౌన్ షుగర్ కొబ్బరి నూనె కలిపేయాలి. ఆరిపోయాక సీసాలోకి తీసుకొని శుభ్రం చేయాలి. ఈ మిశ్రమం తో వాళ్ళు రుద్దుకొంటే చర్మం పగుళ్ళు లేకుండా మెరుస్తూ కనుబడుతోంది.
Categories