నీహారికా,
ఎన్నో విషయాలు మనం భూతద్దంలో పెట్టి చూస్తాం. కాబట్టి చిన్న విషయాలు పెద్దవైపోయి అందాలకు కారం అవుతాయి. చిన్న విషయాలు పెద్దవైపోయి ఆందోళనకు కారణం అవుతాయి. జీవితం ఎమేర్జెంసీ కానే కాదు. ఎంతో సింపుల్ గా వుండే ప్రాధాన్యాలను మాన సంతోషం కోసం కండిషన్స్ గా మార్చుకొంటూ వుంటాం. మనం పెట్టుకునే డెడ్ లైన్స్ అనుడులో లేకపోతే నోచ్చుకుంటాం. మనమే ఎనర్జీలను సృస్తిమ్చుకొన్నామన్న విషయం మరచిపోతాం. ఇవి ప్రశాంతతను దూరం చేస్తాయి. జీవితంలో ఫ్లేక్సిబులిటి కావాలి. మనం చేసే పనుల విషయంలో మనకి మనమే కితాబు ఇచ్చు కోవాలి. ముందుగా మాన్ జీవితం పట్ల మనకు పాజిటివ్ ఫీలింగ్ వుండాలి. చిన్ని చిన్ని ఆశాభంగాలు, నిరాశలు ఉంటాయి. అట్లాగే అసంతృప్తులు ఉంటాయి. అవే జీవితం అయితే కాదు. మన పరిధిలో మన తెలివితేటలు సవ్యంగా ఉపయోగించుకొన్నామాలేదా సరైన సమయంలో చదువు ముగించి తగిన ఉద్యోగం సంపాదించాము, లేదా మనకు లభించిన జీవితం సంతృప్తి కరంగా గడుపుతున్నామా అనేదే ఆలోచించుకోవాలి. మనకి అందిన జీవితంలో చిన్నపాటి అసంతృప్తి వుంటే దాన్నే నిరంతరం తట్టుకుని, నిరాశపడటం విజ్ఞతగల మన్యుషుల లక్షణం కాదు. జీవితంలో ఎదిగే అవకాశాలు వున్నాయి. వాటి దిశగా అడుగులు వేయాలి. అలా అందుకున్న ఫలితాలే మనకి లభించిన గొప్ప బహుమతులు.