Categories
అందం ఆకృతుల విషయంలో ఎవరేమనుకొన్నా ఎన్ని వ్యాఖ్యానాలు చేసిన ఎవరి శరీరం పట్ల వారికి ప్రేమ ఉంటే అవేమీ మనసుకి పట్టకుండా ఉంటాయి . ఎవరి కోసమో ఎవరి దగ్గరో,తమ శారీరక ఆకృతిని జస్టి పై చేసుకోవలసిన అవసరం లేదు ఎవరో ప్రశంసిస్తారని ఎదురు చూడనవసరం కూడా లేదు . సన్నగా ఉన్నా ,బొద్దుగా ఉన్నఎవరి వ్యాఖ్యానాలు అవసరం కూడా ఉండదు శరీరం పూర్తిగా వ్యక్తిగతం . బరువు తగ్గాలని పిస్తే తగ్గాలి మార్పు కోరుకొంటే ఆ దిశగా ప్రయత్నం చేయాలి . శరీరాన్ని ప్రేమించు కొంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి . మనకి మనం నచ్చేల జీవించ గలిగితే చాలు . ఆ స్వయం సంతృప్తి ఆనందం ముఖ్యం .