పాత రోజుల్లో ముక్కు సూటిగా,మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడే వాళ్ళు అని చెప్పేందుకు ఈ సామెత ఉదాహరణ.
ఎక్కడైనా బావ గానీ వంగతోట దగ్గర మాత్రం కాదట ‘
ఎంతటి చమత్కారం బావ అని పిలవటం అంటే చనువుగా బంధుత్వం కలుపుకోవటం కదా. కానీ ఆల పిలిపించు కొన్నవాడు వంగ తోట దెగ్గర మాత్రం కాదని వంకాయలు ఉచితంగా ఇవ్వాల్సివస్తే మటుకు బంధుత్వాలు గుర్తు చేసుకోడు. అక్కడ వ్యాపారమే. కాసులు ఇస్తేనే వంకాయలు ఇస్తాడు. మనుషుల స్వభావం వివరించే సామెత ఇది.
* ఎక్కిన వారికి ఏనుగు లోకువ.
* ఎరను చూసి చేపను పెట్టాడట.
* ఎప్పటి మేలు అప్పుడే.
* నరం లేని నాలుక ఎలాగైనా ఆడుతుంది.
సేకరణ
సి.సుజాత