కొన్ని సినిమాలు ఒక గాయం లాగా బాధపెడతాయి. ఒక వేళ నిజంగా గాయం చుట్టు తిరిగే సినిమా అయితే ఇంక చెప్పేదేముందీ అంటోంది దీపికా పదుకొనే. పెళ్ళి హడావిడి అయిపోతూనే కొత్త సినిమాకు సిద్దం అయిపోతోంది దీపికా. సినిమా పేరు చప్పాక్ .ఇందులో యాసిడ్ దాడి బాధితురాలిగా నటిస్తున్నానని చెపుతోంది దీపికా.ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి పని చేయటం ఆనందంగా ఉంది . పోరాడే పటిమే విజయగేయం ,గాయం చుట్టు తిరిగే కథ ఇది. ఇది యాదార్థగాథ. మనసులు పిండేసే దయనీయమైన కథ ధైర్యంగా జీవితాన్ని మలుచుకొన్న ఓ ధైర్యశాలి అయినా అమ్మాయిగాథ అంటోంది దీపికా పదుకొనే.

Leave a comment