‘ విందైన మూడు రోజులు,మందైనా మూడురోజులే ‘ ఈ సామెత నిత్య జీవిత అనుభవం లోంచి వచ్చినదే మంచి భోజనం కనీసం మూడు రోజుల పాటు వరసగా చేస్తే మనకు తృప్తి పడుతోంది. అలాగే ఏ మందైనా మూడు రోజులు వాడితే వంటికి పడుతోంది అని అర్ధం. స్నేహం విందు,మందులా విడవకుండా రోజుల పాటు చేస్తే అది బలపడి,హృదయానికి దగ్గరై కలకాలం ఉంటుంది అని అర్ధం.
* అపకారికైనా ఉపకారము చేయమన్నారు.
* అప్పు దొరికితే పప్పు కూడు తిన్నాడట !
* అందితే జుట్టు అందక పోతె కాళ్లు.
* అయ్యకు రెండు గుణాలే తక్కువ , తనకు తోచదు, చెబితే వినడు.
సేకరణ
సి.సుజాత