ఇప్పటివరకు పిల్లలు అస్తమానం కంప్యూటర్ కు అతుక్కుపోతే ప్రమాదం అడిక్ట్ అవుతారు. టీవీ లకు కళ్ళు అప్పగించండి ఫోన్ లతో గంటల కొద్దీ మాట్లాడకండీ అనే కదా అంటున్నాం. మెడా కాళ్ళు నెప్పి పుడతాయని సమయం వృధా అని అంటూ ఉంటాం. కానీ వయసు పై బడిన వాళ్ళు కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మానసికంగా షార్ట్ గా ఉంటారని అమెరికన్ న్యూరాలజీ అకాడమీ అధ్యయనం పేర్కొంది. వారానికి ఒక్కసారి లేదా రెండు మూడు సార్లు కంప్యూటర్ ఉపయోగించి పెద్ద వాళ్ళతో జ్ఞాపకశక్తి ఆలోచన సంబంధిత సమస్యలు 42 శాతం తక్కువగా ఉన్నాయిట. ఎక్కువగా దాని పైన పని చేసేవాళ్ళకి అసలే సమస్యలు వచ్చే అవకాశమే లేదు. అలాగే పుస్తకాలూ చదివేవాళ్ళు జ్ఞాపకశక్తి 30 శాతం అధికంగా ఉందన్న సామజిక కార్యకలాపాలు పాల్గొనే వాళ్ళకి 23 శాతం క్రాఫ్ట్ పనిచేసే వారిలో. 16 శాతం క్రీడలు ఆడవాళ్లలో 14 శాతం జ్ఞాపకశక్తి ఆలోచన సంబంధిత సమస్యలు తక్కువే ఉన్నాయని అధ్యయనం రిపోర్ట్. ఎప్పుడైనా మనసు చురుగ్గా ఉంచుకుంటే మానసికంగాను చురుగ్గా ఉంటారని ఒక పదేళ్లు వృద్ధాప్యానికి దూరంగా ఉండచ్చు అంటున్నారు.
Categories