Categories
ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించేందుకు గానూ అమెరికా ఎన్నో రైలు ఏర్పాటు చేసిన సంగీత కచేరీలు పాడింది గీతా రబారి. గీత గానానికి ప్రేక్షకులు డాలర్ల వర్షం కురిపించారు. కోట్లలో ఆ డబ్బు ఉక్రెయిన్ కు అందింది. ఇక్కడే కాదు గీతా రబారి ఎక్కడ పాడిన ఏ సహాయ కార్యక్రమం కోసం గొంతు విప్పిన డబ్బు కురుస్తోంది. ఈమెది గుజరాత్ లోని తప్పర్ గ్రామం మల్ధారి అనే గిరిజన తెగ. గుజరాతి సాంప్రదాయ భజనలు, జానపదాలు పాడే గీత కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రముఖ గాయని గా ఎదిగింది. లక్షల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రధాని మోదీ తో సహా ఎందరో ప్రముఖులు మెప్పును అందుకుంది గీతా రబారి.