ఒడిస్సాలోని మహిళా పోలీస్ అధికారి శుభ శ్రీ నాయక్ ఒక మతిస్థిమితం లేని మహిళకు అన్నం తినిపిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో జనం ప్రశంసలు అందుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ దృశ్యాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు .ఆమె ఒడిషాలోని మల్కాన్ గిరి మోడల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ .లాక్ డౌన్  లో డ్యూటీ లో రోడ్డు పై వెళ్తుండగా బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని తాగేందుకు అవస్తపడుతున్న మహిళ కనిపించింది.ఆమెకు మంచి నీళ్లు ఇచ్చి తన జీపులో  ఉన్న లంచ్ బాక్స్ పట్టుకో పోయి ఇచ్చింది శుభ శ్రీ .కానీ ఆ మహిళ ఆరోగ్యం బాగోలేదు.తినేందుకు కూడా ఆమెకు తెలివి శక్తి రెండూ లేవు .శుభ శ్రీ ఆమెకు ఆహారం తినిపిస్తూ ఉన్న దృశ్యాన్ని ఎవరో షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు .ఆ వీడియో వైరల్ అవుతోంది .

Leave a comment