100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తీసిన ఈ డన్ కిర్క్ సినిమా 525 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి దర్శకుడు క్రిష్టోఫర్ నోలాన్, అతని భార్య ఎమ్మా థామస్ కల నిజం చేసింది. ఇది వార్ మూవీ. సస్పెన్ష్ థ్రిల్లర్ కుడా. 1940లో రెండో ప్రపంచ ప్రారంభంలో బ్రిటన్, ఫ్రాన్స్ , బెల్జియం , కెనడా దేశాల సైనిక దళాలు ప్రాన్స్ లోని డన్ కిర్క్ రేవులో సమావేశం అయ్యారు. హిట్లర్ నేతృత్వంలోని జర్మన్ సైన్యం ఈ సైనికుల పై విరుచుకుపడింది. తొమ్మిదిరోజులు యుద్దం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం డన్ కిర్క్ లో చిక్కుకున్న తమ సైనికులను బ్రిటన్ చేర్చుకుంది. ఈ ఆపరేషన్ పై కథే డాన్ కిర్క్ సినిమా. సముద్రంలో షూట్ చేసిన సీన్లను ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ సహాయం తీసుకున్నారట క్రిష్టోఫర్ . ఈ అద్భుతమైన సినిమా చూసి తీరాలి.

Leave a comment