Categories
బజార్లో దొరికే ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ ఫ్లేవర్డ్ లేదా డిటాక్స్ వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . మనకు నచ్చిన కూరగాయలు పండ్లు ఔషధ గుణాలు ఉండే పుదీనా లైమ్ రోజ్ మేరీ, గులాబీ రేకులు ఇలా వేటి తో నైనా ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ తయారు చేసుకోవచ్చు. ఒక గాజు పాత్రలో లేదా సీసాలో నాలుగైదు రకాల పండ్ల ముక్కలు వేసి, తులసి, పుదీనా వంటివి చేర్చి చల్లని నీళ్లు పోసి ఐదారు గంటలు అలా ఉంచితే చాలు వీటిలో ఉప్పు చక్కెర అస్సలు అక్కర్లేదు. సహజ పద్దతులతో తయారు చేశాం కాబట్టి వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. పండ్ల ముక్కలు, మూలికల నుంచి తయారయ్యే విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ నీళ్లలోకి చేరి శరీర మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి.