Categories
పల్లీలను వేయించి వేయించినప్పుడు వాటిల్లోని పి-కౌమారిక్ ఆమ్లం 22 శాతం పెరుగుతుంది అందుకే వేయించిన పల్లీలు యాంటీఆక్సిడెంట్లు బెర్రీ ల్లో కంటే ఎక్కువ ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని పచ్చిగా వేయించి నానబెట్టి మొలకలు తెప్పించి ఉడికించి ఎలా తిన్న పోషకాల్లో పెద్ద వ్యత్యాసం ఉండదు అంటున్నారు. కణ విభజన కు అవసరమయ్యే ఫోలెట్ పల్లీల్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.వేరుసెనగ గింజల్లో ఉండే విటమిన్-ఇ మంచి యాంటీ ఆక్సిడెంట్ వీటిల్లోని మెగ్నీషియం కండరాలు ఎంజైములు పనితీరుకీ శక్తి ఉత్పత్తికి తోడ్పడుతుంది. రోజుకో గుప్పెడు వేరుశెనగ గింజలు ఒక చిన్న బెల్లం ముక్క అత్యంత శక్తినిచ్చే పోషక ఆహారం.