Categories

కాశ్మీర్ లో మొట్టమొదటి పోస్ట్ ఉమెన్ ఉల్ఫాతా బానో. ఆమె 30 ఏళ్లుగా మంచులో నడుస్తూ ఉత్తరాలు నడుస్తోంది. మంచు తుఫాన్ లు, కాశ్మీర్ ప్రాంతం కావడం వల్ల కాల్పుల భయం కూడా ఉంటుంది కానీ ఉల్ఫాతా మాత్రం ఎప్పుడు డ్యూటీని అలక్ష్యం చేయలేదు.ప్రతిరోజు కనీసం 20,30 పార్సల్స్ ఉత్తరాలు ఉంటాయి.ఆమె జీతం నెలకు 22 వేలు.ఎంతో అవసరం అయితే తప్ప ఎప్పుడూ సెలవు పెట్టలేదు అంటుంది ఈ పోస్ట్ ఉమెన్ ఉల్ఫాతా బానో.