నీహారికా,
నీకో మంచి వ్యక్తిని పరిచయం చేయాలి అనుకున్నాను. చాలా మంది చాలా మంచి పనులు చేస్తేనే ఈ ప్రపంచలో కొందరైనా సుఖంగా వున్నారు. ఇతని పేరు ఫ్యా ట్రిక్ కిలోంజో. కెన్యాకు చెందిన ఈ మనిషి కీకరణ్యంలోకి వాటర్ ట్యాంకర్ తీసుకోకపొతాడు. చిన్న చిన్న కుండలు నింపుతాడు. వన్య మృగాల దప్పిక తీరుస్తాడు. అడవి దున్నలు, జీబ్రాలు, ఏనుగులు వంటి జంతువులకు నీటిని అందిస్తూ వేసవి తాపం నుంచి వాటిని రక్షిస్తున్నాడు. అడవి లో ఎందుకీ జలదానం అంటే మనకు కనీసం అడిగేందుకు నోరుంది. ఈ జంతువులకు అడగడం కుడా తెలియదు. జీవన శైలి విధానాన్ని కాపాడుకోవాలంటే వాటిని రక్షించుకోవాలి. అందుకే నాకు చేతనైన సాయం చేస్తున్నాను అంటాడు. భవిష్యత్తులో అడవిలో శాశ్వత నీటి కొలను కల్పిస్తాడట. ఇతన్ని చూసి ఎంత నేర్చుకోవాలి. సాటి జీవుల పట్ల దయ, కరుణ కలిగి వుండటం మనిషి కర్తవ్యం. పుట్టినందుకు ఎదో ఒక చిన్న పనైనా సాటి వాళ్ళ కోసం చేసే జీవితం ధాన్యం అనుకోవాలి. అందుకేనేమో ఇతని పరిచయం. ఇతని కధంతా వుంది. ప్యాట్రిక్ కిలోంజో ఫ్రమ్ కెన్యా అని కొడితే స్టొరీ మొత్తం చదువుకోవచ్చు.